అది నువ్వే..
చల్లని జాబిలమ్మ నుంచి...
కురుస్తున్న వెన్నెల...
శీతల పవనాలకు మరింత....
గడ్డ కడితే...
ఆ వెన్నెల ముద్దను ఓక చోట
చేర్చి...
ఒక అందమైన ఆకృతిగా...
మలిచి...
సుగంధాలు వెదజల్లే ..
గులాబీ బాల రేకులనుంచి...
సుకుమారత్వాన్ని ...
రంగరించి...
మల్లెల పరిమళాలను..
తనువంతా అద్ది...
నీలి మేఘ మాలికల సోయగాలను...
కురులుగా సింగారించి...
కడలి కెరటాలను..
ఎద పొంగులుగా కూర్చి....
తేనె రసాలను...
పెదాలపై చిలకరించి..
నెమలి నడకల పాఠం నేర్పి...
ఒక అందమైన శిల్పం లా ...
తీర్చిదిద్దితే....
అది నువ్వుగా...
నీలోని నవ్వుగా...
విరిసిన పువ్వులా..
నా మనసులో దూరి పోయావు..
అది నువ్వే...
మనస్వినీ...
No comments:
Post a Comment