Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday, 12 December 2014

నువ్వుకానే కాదా...



నువ్వుకానే కాదా...

 
నా పలుకులు నీవేనని...
నీకు తెలుసు..
నా అక్షరం నీకే...
అంకితమని....
నా భావనలు నీవేనని ...
నీ మనసుకూ తెలుసు...
నా కనురెప్పల తెరలపై...
అల్లుకున్న కలలకు....
నువ్వు ప్రతిరూపమనీ తెలుసు...
అయినా ఎందుకో....
నా అక్షరాలను...
దూరంగా విసిరేస్తున్నావు...
నా భావాల్లో నీ రూపం...
లేనే లేదంటావు...
నా కలల కంటి తెరలను...
చించి వేస్తున్నావు...
నీ మనస్సు పోరల్లో...
ఒక్కసారి తొంగి చూడు...
అదంతా నీవు కాదా...
కాదని నిజం చెప్పు...
నా మనసును ...
నేనే చంపేస్తాను...
మనస్వినీ...

2 comments:

  1. Replies
    1. Thank u so much for understanding the feelings of poetry... your poetry is awesome and nice page layout........

      Delete