మౌనమే నా భాష..
అవును నాకు మౌనమంటే ఇష్టం...
అందుకే నేను మౌనంగానే ఉంటాను...
ఎక్కడ ఉన్నా....
ఎవరితో ఉన్నా...
ఎక్కువగా మౌనమే నాకు ఇష్టం...
అందరూ మాట్లాడుతూ ఉంటారు...
నేను అందరినీ వింటుంటాను..
అయినా పలకను...
అదేదో అహంకారం అని ...
అనుకుంటారు అందరూ...
పొగరు అని అంటారు మరి కొందరు...
నా వ్యవహారం కొందరికి నచ్చుతుంది...
చాలా మందికి నచ్చదు....
ఎవరు ఎలా అనుకున్నా...
నేనలాగే ఉంటాను...
అలా ఉండటమే నాకిష్టం...
పాపం వారికి తెలియదు...
నాలో దాగిన మరో నిజముందని....
నేనెప్పుడూ మౌనంగా లేనని...
నేను మాట్లాడుతూనే ఉంటాను..
నా మాటలు ఎవరికీ వినిపించవు...
నా పెదాలను దాటి పలుకులు బయటికే రావు...
అయినా నేను మాట్లాడుతూనే ఉంటాను...
నా చర్చలు ఎప్పుడూ నా మనసుతోనే....
నా మనోసంద్రంలో...
చెలరేగుతున్న అలలతో ...
కన్నీటి తెరలతో....
నేను నిత్యం మాట్లాడుతూనే ఉంటాను...
నేను మౌనంగా ఉన్నా...
మాట్లాడుతూనే ఉంటాను...
మనస్వినీ....
No comments:
Post a Comment