నా భావం నేనే...
మనసు తోటలో వికసించే...
పుష్పమే నా భావం...
ఆ భావమే అక్షరాలుగా ...
ఒకదానిని ఒకటి...
పెనవేసుకుని...
అందమైన మాలికగా...
అల్లుకుంటే...
అదే నాలో ఉదయించే కవిత...
భావం మనసు నుంచి...
జనియించినా...
అది భావమే కానీ ఆరోపణ కాదు...
నా భావంలో ఆవేదన...
అంతకు మించిన రోదన...
ఎల్లలు లేని ఆరాధన...
ఏది కురిసినా...
అది నా అంతరంగమే...
నా భావాన్ని...
నా అంతరంగాన్ని...
మనస్వినికి అంకితమిచ్చాను...
తప్ప మనసును దోషిని చేయలేదు...
ప్రేమలోనూ...
ఆవేశంలోనూ...
రోదనలోనూ...
ప్రకృతి అందాల్లోనూ...
సమాజంలోని రుగ్మతలోనూ...
లీనమయ్యాను...
అందుకే నాలో భావనలు...
ఉద్భవిస్తున్నాయి...
నా భావనలకు...
నాలోని అంతరంగాలకూ...
కారణం...
నేను గాక నువ్వెలా అయ్యావు...
మనస్వినీ...
No comments:
Post a Comment