నీ పాదాలపై పువ్వునై..
నీ కంఠ సీమలో ప్రేమ హారం కావాలని...
మమతల మాలలు అల్లుకున్నా...
నీ శ్వాసలో శ్వాసను కావాలని...
నిత్యం ఊపిరి తీసుకుంటున్నా...
నీ నయనాల్లో మెరుపును
కావాలని...
నాలో జీవం నింపుకుంటున్నా...
నీ అంతరంగం లో ఓ తరంగం
కావాలని...
నా ఆలోచనలు
రంగరించుకుంటున్నా...
నీ భాషలో భావం కావాలని...
నా అక్షరాలను ఏరుకుంటున్నా...
నీ నడకలో నడతను కావాలని...
అడుగుజాడలను సవరించుకుంటున్నా...
ప్రేమ హారాన్ని కాలేకున్నా...
అడుగుల జాడగా నడవలేకున్నా...
భావం కాలేకపోయినా...
భాష్యం పలకలేకపోయినా...
నీ చరణాలపై రాలిపడే ...
పువ్వునయినా చాలదా...
మనస్వినీ...
No comments:
Post a Comment