టాం అండ్ జెర్రీ...
ఒకరికి ఒకరు ఎదురు పడితే చాలు...
పొగల సెగలు రేగుతుంటాయి...
ఆకాశం దద్దరిల్లుతుంది...
ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ...
రణరంగం తలపిస్తూ సిగపట్లు పడతారు...
ఒకరు మౌనంగా ఉంటే...
మరొకరికి నచ్చదు...
మూడో కంటికి తెలియకుండా ...
నిప్పు రాజేస్తారు..
ఇద్దరూ ఒకే చోట చేరితే...
కిష్కింద కాండ ఖాయం...
మరి ఒకరు లేకపోతే...
మరొకరికి ఏం తోచదు...
ఎదో కోల్పోయిన వేదన...
ఎప్పుడెప్పుడు చూడాలా అన్న తపన.....
ఒకరి కంట నీరు ...
మరో కంటిలో తడి..
ఇద్దరూ బావున్నారా ...
మళ్ళీ యుద్ధమే..
వారిద్దరు ఎవరో కాదు..
నా పాప బాబూ...
వీళ్ళిద్దరూ నిజంగా ...
టాం అండ్ జెర్రీ లే కదా...
మనస్వినీ..
nijame, vaalliddaru kottukunnatlu kanapadina, vaaridi vidadeeyaleni bandham
ReplyDeleteఅవునండీ...ఏ ఇంట్లో పిల్లలయినా టాం అండ్ జెర్రీలే కదా...
Delete