Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 7 December 2014

కనురెప్పల మాటున....

కనురెప్పల మాటున....

 
ఏమయ్యింది....
ఎందుకింత చీకటి...
గడచిన క్షణం వరకు....
అన్నీ వెలుగు రేఖలే...
ఆ వెలుగుల దొంతరలలో ...
ఆడుకున్నా పాడుకున్నా..
అంతలోనే ఏమయ్యింది...
మెల్ల మెల్లగా వెలుగులు ...
మాయమవుతున్నాయ్...
కొంచెం గాభరా పడ్డాను...
మరి కొంచెం ....
తత్తరపాటు...
ఆ వెలుగులు ఎటువెళుతున్నాయో...
అటువైపే అడుగులు వేసాను...
అప్పుడు చూసాను...
నా వెలుగులు ఎక్కడ...
సేదతీరుతున్నాయో...
అలసి సొలసిన చెలియ....
కాసింత సేదతీరాలని...
బడలికగా ...
మెల్ల మెల్లగా ...
కన్నులు మూస్తూ ఉంటే...
వెలుగులు ఆ కళ్ళలోకే ..
మరలిపోతున్నాయి....
మూసిన కనురెప్పల్లో...
నా వెలుగులన్నీ...
సేదతీరుతున్నాయి...
అర్థమయ్యిందా....
నీ కంటి వెలుగులే ....
నా జీవన తరంగాలు...
మనస్వినీ...

No comments:

Post a Comment