ఆ బాల్యమే కావాలి..
తెల్లారగానే చెరువుగట్టుకు పరుగులు...
దొరుకుతాయో దొరకవో...
తెలియనే తెలియదు...
అయినా గాలంతో ఆరాటం...
చేపలకోసం పోరాటం...
పొద్దుపోయేదాకా...
చెరువు గట్టునే సావాసం...
జెండావందనం పండగ వస్తే చాలు...
గులాబీ తోటలపై యుద్దం...
దోచుకువచ్చిన పూలతో...
జాతీయ జండా కు సత్కారం...
మల్లిగాడి అక్క పెళ్లి...
అది మా అందరి ఇంటా పెళ్ళే...
చుట్టాలందరి బాధ్యత మాదే...
పెళ్లి మంటపం నుంచి ఇంటి అలంకరణ మాదే...
ఇక పెళ్లి విందులో మేమే..
బారాత్ డ్యాన్సులో మేమే...
సీతాఫలాల తోటలో...
మామిడి తోపులో ...
అల్లనేరేడు చెట్టు కింద...
శంకర్ గాడి మల్లెతోటలో...
అన్నింటా మేమే..
బోనాల జాతరలో..
పోతరాజు చిందుల్లో...
పీర్ల పండగ ఊరేగింపులో...
దసరా బంగారంలో..
జమ్మి చెట్టు ఆకుల్లో...
రంజాన్ షీర్ ఖుర్మా తీపిలో ...
మేమే ఉన్నాం...
వర్షం చినుకుల్లో...
మట్టి వాసనల్లో...
సెలయేటి నీళ్ళలో...
ఎండమావుల్లో...
ఎక్కడ చూసినా మేమే...
అవును నేనూ నా దోస్తులు...
అది నా చిన్న నాటి జీవితం...
ఆనాటి బాల్యం ఎంత మధురం...
బాధ్యతలే తెలియని అనుబంధం..
బరువులే లేని ఆనందం...
ఆ బాల్యం మళ్ళీ తిరిగి వస్తే...
ఎంత ఆహ్లాదం...
తిరిగి రాదనీ తెలుసు...
అయినా ఆ దేవుడే దిగివచ్చి...
ఏం కావాలని వరమడిగితే...
బాల్యమే ఇవ్వమంటాను...
మనస్వినీ...
good one. బాలానందం! బ్రహ్మానందం! మార్కెట్ తెలియని మహదానందం!
ReplyDeleteధన్యవాదాలండీ..నిజంగా ఆ బాల్యం తిరిగి వస్తే ఎంత బావుంటుంది...
Delete