రాలిన ఆకును...
చివురులా ....
మారాకులా...
చిగురాకులా....
పచ్చదనాల పొదరిల్లులా...
వసంతానికే పచ్చదాన్ని.....
అద్దిన హరిత దళంలా..
సోయగాలు చిందించిన ....
ఒక పచ్చని ఆకు....
కాలానికి ఎదురీదినా...
పరిస్థితులకు.....
తలొగ్గక తప్పలేదు...
ఆకులు రాలే కాలానికి ...
తలవంచిన ఆ ఆకు....
రాలిపోయింది....
గాలిలో కలిసిపోయింది...
తన కన్నతల్లి చెట్టును వదిలేసి...
దిక్కు తెలియని చోటుకు ...
ఎగిరిపోయింది...
వాడిపోయి వడలిపోయిన ఆకు...
అలా దుమ్ము ధూళిలో....
కలిసిపోయింది...
అంతలోనే ఎదో మార్పు...
ఆకాశం నుంచి జారి పడుతున్న...
వాన చినుకుల్లో...
ఆ ఎండుటాకు తడిసిముద్దయ్యింది...
ఆకులో మళ్ళీ ఆశలు చిగురించాయి...
తన గతం మళ్ళీ చిగురిస్తుందా అని...
వాన జల్లులో తడిసిన
తనను తాను చూసుకుని మురిసిపోయింది...
కానీ ఏం లాభం...
పాపం ఆకు ఆశలు తీరనే లేదు..
అది వానకు తడిసి కుచించుకుపోయింది..
చేజారిన గతం...
ఎక్కడైనా మళ్ళీ ...
చిగురిస్తుందా...
ఎండుటాకు మళ్ళీ...
వికసిస్తుందా...
మనస్వినీ...
No comments:
Post a Comment