మనసు రాజీనామా...
ప్రతి క్షణం తిరస్కారం...
ప్రతి పలుకులో వెటకారం...
ప్రతి భావంలో అనుమానం...
తిరస్కారమే నీ జీవన విధానమా...
అనుబంధం నిజమే అయితే...
మనసులో మమకారం...
నిజంగానే ఉంటే...
గడిపిన ప్రతి క్షణం లో...
మధురిమలే మదిలో ఉంటే...
అనుభవాలే కాదు...
అనుబంధమూ...
నీలో ఉంటే...
మాటలు ఇలా ఉంటాయా..
పలుకులు విషాన్ని
చిమ్ముతాయా...
బంధువులనే రాబందుల...
కుట్రలకే ప్రాణం పోస్తావా...
అది నా ప్రాణం తీయదా...
నువ్వు నన్ను తిరస్కరించు...
కాదనలేను...
పగిలిన గుండె చెబుతోంది...
ఇప్పుడు నాకు నేనే...
రాజీనామా ఇస్తున్నానని...
మనస్వినీ...
No comments:
Post a Comment