తప్పెవరిది..
ఎదురుగా ఏదో రక్తం ముద్దలా ....
పడి ఉంటే చూశాను....
ఏదో కదలిక....
ఏమిటా అని చేతిలోకి తీసుకున్నా...
అది రోదిస్తోంది....
అలమటిస్తోంది...
తీరా చూస్తే...
అది గుండె...
దగ్గరికి తీసుకుని చూస్తే ...
అది నా గుండె...
దాని అంతరాల్లో ఏదో గుచ్చుకుని ఉంది...
పరికించి చూశాను...
అది రత్న మణిహారాలు పొదిగిన కత్తి...
నా గుండెను ఎక్కడెక్కడో కోసేసింది...
ఇంకా కోస్తునే ఉంది..
అసలేమయ్యింది అని అడిగాను...
అప్పుడు నా గుండె ఇలా చెప్పింది...
ఎంతో అందమైన వజ్రాలు
పొదిగిన ఈ కత్తి నా నేస్తం...
ఈ నేస్తం కోసం నేను తపించాను...
పరితపించాను...
నేస్తం కూడా నాకోసం అంతే ఆరాటపడింది...
నన్ను తన కౌగిలిలో బంధించే ప్రయత్నం చేసింది...
ఏమయ్యిందో ఏమో నాలోకి ...
దూసుకుపోయింది...
ఆర్తిగా హత్తుకున్నా..
నా నేస్తం నాలోకి దిగిపోయింది...
విలపిస్తున్న గుండెను....
అలా చూస్తూ ఉండిపోయాను...
ఆ కత్తి కూడా...
మోహంతోనే వాటేసుకుంది....
ఇద్దరిలోనూ....
కనిపిస్తున్నది ఆరాధనే...
మరి ....
తప్పెవరిది....
మనస్వినీ...
No comments:
Post a Comment