ముభావమైన భావం...
భావం ముభావమైతే...
అర్థం అనర్థమైతే...
చీకటి వెలుతురునే...
కమ్ముకుంటే...
కనుచూపు మేరలో ...
కాంతి కానరాకుంటే...
ఒక శూన్యం నుంచి...
మరో శూన్యంలోకి...
అడుగులు పడుతుంటే...
ప్రతి అడుగూ చీకటినే ...
ముద్దాడుతుంది...
కలలన్నీ కల్లలుగా...
గుండెను తాకుతుంటాయి...
అప్పుడు మనసులోనూ...
నిశివర్ణం అలుముకుంటుంది...
అప్పుడు కావలసింది...
మనసుకు ఒకింత ఓదార్పు...
మాటల తూటాలు కాదు...
నేనున్నా నీకు ...
అనటం కాదు...
నేనున్నా అనే భావన ...
కల్పించాలి...
మనసులో ఉన్నది ...
పలుకులో లేనప్పుడు...
వాడిన వసంతంలో...
ఇంద్రధనుస్సు ...
మెరిసినట్టే కదా...
మనస్వినీ...
No comments:
Post a Comment