మన ప్రేమ పదిలం...
సాగర తీరంలో...
ఇసుక తిన్నెల్లో...
రాసుకున్న అక్షరాలు ...
కొట్టుకుపోయాయి....
కట్టుకున్న ఇసుక గూళ్ళు...
కూలిపోయాయి...
నువ్వూ నేనూ...
నడిచిన బాటలో ....
అడుగుజాడలు ...
చెదిరిపోయాయి...
రాళ్ళపై అందంగా ...
చెక్కుకున్న మన పేర్లూ...
మాసిపోయాయి...
చెట్ల మొదళ్ళపై...
గీసుకున్న ప్రేమ...
ఎండిపోయింది...
వసంతం వాడినా...
అంతా చెదిరిపోయినా...
గుండె పుటలపై...
చెక్కుకున్న మన పేర్లు...
కలకాలం ...
వికసిస్తూనే ఉంటాయిగా ...
మనస్వినీ...
No comments:
Post a Comment