మనోఫలక చిత్రమా...
మధుర మందస్మితా...
మయూర నడకల ...
మందగమనా...
నీలి మేఘాల చంద్రమా...
భావకుడినికాదు...
నీ అందాలను ...
వర్ణించజాలను...
అయినా ఎందుకో నాలో...
నిన్ను చూడగానే...
భావ మాలికలు...
అక్షర పుష్పాలుగా ...
విరబూస్తున్నాయి...
వాలిన నీ కనురెప్పల మాటున...
జారిపడుతున్న ...
చల్లని వెన్నెలలో ...
నా అణువణువూ...
పునీతం కాదా...
నీ కురులను అల్లుకున్న ...
విరుల వర్ణాలు...
నా కంటి వెలుగు జాడలే కాదా...
నీలో నీ తనువులో...
నీ అణువణువులో...
గుభాళించే ...
సుగంధం నాకు...
ప్రాణవాయువేకాదా...
నీ పెదాల పూదోటలో...
జాలువారే మకరందం...
నాపాలిట అమృతమే కాదా...
కడలి కెరటాల ...
నీ ఎద పొంగులు...
అవి నాకు సుందర కాశ్మీరాలు కావా...
మనో ఫలక చిత్రమా...
హృదయసామ్రాజ్య విరాజమా...
సర్వం సమస్తం ...
అన్నీ నీవే కాదా...
మనస్వినీ...
No comments:
Post a Comment