అంతరాత్మా
క్షమించు...
అద్దం ముందు నిలబడి
నన్ను నేను చూసుకున్నాను...
అవును అది నా రూపమే...
నేనే అక్కడున్నాను...
నేనేనా అనుకుని
మరోసారి చూసుకున్నాను...
ఎదో తెలియని మార్పు...
నేను కాదు అది...
ఆ రూపం క్రమంగా
మార్పు లోకి మారుతోంది...
భీకరమైన మార్పు ...
మున్నెన్నడూ చూడని ఆకారం...
నావైపు రౌద్రంగా చూస్తూ
గర్జిస్తోంది...
చెవులు పగిలిపోతాయా
అన్న భయం నాలో...
అది నన్ను ప్రశ్నిస్తోంది...
నాపైనే నిందలు వేస్తోంది...
అన్నింటికీ మూలం
నేనే అంటోంది...
ఊహ తెలిసిన నాటి నుంచి
మతిమరుపు ఆవహించిన
నేటివరకు
జీవన గమనంలో
నేను వేసిన తప్పటడుగులను
ఎత్తిచూపుతోంది...
అన్ని నిందలు
నాపైనే వేస్తోంది...
నాపై అగ్నిశిఖల్లా
కురుస్తున్న ప్రశ్నల
బాణాలను భరించలేక
మెల్లగా
దర్పణం ముందునుంచి
పక్కకు జరిగాను...
అంతరాత్మ ప్రశ్నలకు
నాదగ్గర
సమాధానం లేనే లేదు
మనస్వినీ...
This comment has been removed by a blog administrator.
ReplyDeleteఅంతరాత్మ కాదు నేనే భయపడుతున్నా పద్మార్పితగారూ...థాంక్స్ అండీ...కానీ పొరపాటున మీ కామెంట్ డిలిట్ అయ్యింది క్షమించగలరు...
Delete