మిగిలేది కన్నీళ్ళే...
మనిషికీ మనిషికీ...
మనసుకూ మనసుకూ...
గతం ఉంటుంది...
స్వగతమూ ఉంటుంది...
గతమనే కాలంలో...
అడుగుల జాడల్లో...
రాలిపడిన పువ్వులూ...
రుధిరం రుచి చూసిన ముళ్ళూ...
స్పష్టంగానే కనిపిస్తాయి...
కాలంతోపాటు...
ముందుకు సాగినప్పుడు...
ఎదురుగా విచ్చుకున్న పువ్వులూ...
స్వాగతం పలుకుతాయి...
మనసు మనసే అయితే...
స్వగతంలో రేగిన ...
తీపి గురుతులు...
కన్నీటి సుడులూ...
రెండూ పలకరిస్తాయి...
తప్పులు చేసేది మనిషే...
తప్పుగా ఆలోచించేదీ మనసే...
మనసు మనసుపై ...
నమ్మకం కోల్పోతే...
పువ్వులు వాడిపోతాయి...
కన్నీళ్ళే మిగిలిపోతాయి...
మనమేం చేస్తున్నామో ...
మన మనసుకు తెలిస్తే...
అదే పదివేలు ...
మనస్వినీ...
No comments:
Post a Comment