పదమంజీరాలు...
గుప్పెడు మనసు ...
నా ఇల్లయితే...
నా ఇంట్లో నడియాడే ...
దేవతవు నీవు...
నీ పద మంజీరాల సవ్వడి...
నిత్యం నాకు...
మేలుకొలుపులు...
మువ్వల సవ్వడితో ...
నిదురలేచే నేను...
నీ మయూర నడకలతో ...
పులకించిపోనా...
అటూ ఇటూ...
వయ్యారంగా నడిచే నిన్ను...
చూస్తుంటే...
ఇల్లే నందనవనంలా...
అనుభూతినిస్తుంది నాకు...
నీ పలుకులు కోయిల పాటలై...
మదిని దోచుతూఉంటే...
నీ నవ్వులు పువ్వులుగా ...
విరబూస్తూ ఉంటే...
నిశి వేళలో...
ఆ లేత పాదాలను ...
అలవోకగా అల్లుకున్న ...
ఆ చిరు మువ్వల ...
సవ్వడియే...
జోలపాడుతుంటే...
స్వర్గం నీలో కాక ...
ఇంకెక్కడుంది...
మనస్వినీ...
No comments:
Post a Comment