నా భాష నా భావం...
మాతృ భాష ఉర్దూ సుగంధాలు...
నాకు అబ్బలేదు...
మహానుభావుల గజల్స్ పరిమళాలు...
నేను రుచి చూడలేదు...
గుండెను తట్టే అర్ధాలు ...
తీయనైన అక్షరాలు ...
నేను చదువుకోలేదు...
ఉర్దూ అక్షరాలతో ...
ఆడుకోవటం నాకు రాదు...
సుగంధ భరితం తెలుగును కూడా...
నేను తెలుసుకుంది కొంత మాత్రమే...
పదాల విరుపులు...
అక్షరాల అలంకారాలు...
యాసలు ప్రాసలు తెలుసుకోలేదు...
సంస్కృతంలో ఏ ఒక్కదానికీ...
సరైన అర్ధమే తెలియదు నాకు...
లోకం మనసును చూరగొన్న...
ఆంగ్ల భాష భావకుల కల్పనలు ...
నా గుండెను తాకలేదు...
అక్షరాలు నన్ను శాసించలేదు...
అక్షరాలతో నేను ఆడుకోలేను...
నాకేదీ తెలియదు నాకేమీ రాదు...
ఏమీ రాకున్నా ఏదీ తెలియకున్నా...
నువ్వు అనే భావనలో
పుట్టిన నా ఆలోచనలను...
నా అంతరంగాలను పిచ్చిరాతలుగా
రాసుకుంటూనే ఉన్నా....
కవులని చెప్పుకునే పెద్దలకు
నా భావం అర్ధం కాకున్నా
భావ ప్రపంచంలో
తేలియాడే మనసులకు...
నా అక్షర విలువ తెలిసిరాకున్నా...
నీ చుట్టూ తిరిగే
భావాలను రాస్తూనే ఉంటా...
మళ్ళీ మళ్ళీ రాస్తా
మనసు బాసలను...
అక్షర మాలలుగా అల్లుకుంటూ
నీ కంఠమును అలంకరిస్తూనే ఉంటా...
మనస్వినీ....
so nice...
ReplyDeletethanks
ReplyDelete