Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 24 January 2015

అనుభవం కన్నా అనుబంధమే మిన్నా...



అనుభవం కన్నా అనుబంధమే మిన్నా...


అందమైన పూదోటవే...
ఉద్యానవనంలో
విరిసిన గులాబీవే...
మనసును మైమరిపించే
సుగంధ ద్రవ్యానివే...
అయినా నువ్వు
నా ఆహ్లాదం కాదు ...
నా ఆటవిడుపుకానేకాదు ...
ఆనందమే కోరుకుంటే
నా మనస్సు...
ముళ్ళున్న గులాబీయే ఎందుకు...
సన్నజాజులూ
విరజాజులూ
మత్తెక్కించే
మరుమల్లెలలూ
ఎన్ని పూబంతులు లేవు
ఈ జగతిలో...
పలకరించే
పువ్వులు
కవ్వించే పువ్వులు
అడుగడుగునా
పువ్వులే కదా...
ముళ్ళు ఉన్నా
ఆ ముళ్ళు గుచ్చుకుంటాయని
తెలిసినా
గులాబీ కోసమే
ఎందుకు నా తాపత్రయం...
అనుభవం కాదు
అనుబంధం ముఖ్యం
ఇదే నా తత్వం...
ఇది ఎందరికి
తెలిసేను
మనస్వినీ...

No comments:

Post a Comment