కన్నుల్లో
కథలు...
భావకుడి కలలకు
అందమైన భాష్యాలు
నీ నయనాలు...
నీలాల నీ కురులలో
జడలల్లుకున్న
నా స్వప్నాలకు
నెలవులు నీ నయనాలు ...
నా మదిలో రేగిన భావాలు
నా కలం నుంచి జాలువారిన గీతాలూ
నీ కళ్ళలోనే దాచున్నాను...
నవ్వులు రువ్వే పువ్వులనూ
నీలి నింగి సోయగాలనూ
కొలనులోని మీనాలనూ
పరుగులు తీసే లేడి పిల్లనూ
నీ కళ్ళలోనే చూశాను...
నెలవంక వెన్నెలనూ
వెన్నెలకు పులకించే కలువబాలనూ...
నిశి దుప్పటి సరదాలనూ
నీ నయనాల్లో
తిలకించి పులకించి పోయాను...
ప్రకృతి అందానికే
తలమానికమైన మగువకు
నయనాలే కదా అలంకారం
మనస్వినీ...
No comments:
Post a Comment