మనస్విని నేనే...
నేను రాసుకుంటున్న అక్షరాలు
నావే...
నా కవితలకు మూలం నేనే భావం నేనే...
నా అక్షరాలు ఎవరినీ ప్రశ్నించవు...
అవి నా వ్యక్తిగత జీవితం ఎంత
మాత్రం కావు...
అన్నీ నాఊహలే ...భావకుడి భావం ఒక
కల్పన...
సూటిగా చెప్పాలంటే...అవి నిజాలు
కాదు అబద్దాలే...
ఎవరికీ వర్తించవు...ఊహ తెలిసిన
నాటినుంచే ఊహల్లో
విహరించా...లేనేలేని ఊహాసుందరిని
మూల పదార్ధంగా
మలుచుకుని కవితలు అల్లుకున్నా...ఊహా
సుందరినే ఆరాధించా...
ఆరాధనంలోనే అక్షరాలుగా
దిద్దుకున్నా ...మనస్విని పేరుతో బ్లాగ్
ప్రాంరంభించి మళ్ళీ
రాస్తున్నా...అవును ఇప్పుడు మనస్విని నా వస్తువు...
నా ఊహలకు ప్రతిరూపం మనస్వినియే...అలాగని
నా భావావేశం...నా వేదన..నా ఆగ్రహం మనస్విని కాదు...ఇప్పుడు నా పదం మారుతోంది...భావమూ
మారుతోంది...శైలీ మారుతోంది...నా అన్వేషణ మాత్రం నిరంతరం కొనసాగుతూనే
ఉంటుంది...ఊహాలోకంలో సుందరిని శోధిస్తూనే ఉంటా...ఊహా సుందరి అంటే ఒక అందమైన స్త్రీ
రూపం మాత్రమే కాదు...అందమైన మనసు..అందమైన పలుకు..నా దిశా దశ..నాభావనా తరంగం...నా
ఊహల్లో మాత్రమే కనిపించే సుందరి...
నా భావనలు నిరంతరం అన్వేషిస్తూ
ఉంటాయి...నా అక్షరాలూ వెతుకుతూనే ఉంటాయి...అయితే ఇవన్నీ నా భావనలే...నా జీవితంలోని
ఏ ఒక్క సంఘటనతో నా అక్షరమాలకు సంబంధమే లేదు...భావమూ నేనే...భావనాయిక మనస్వినీ నేనే...
No comments:
Post a Comment