చిన్నదే నా మనసు....
గుండెల్లో రొద పెడుతున్న ...
వేదనలూ రోదనలూ...
ఎగసిపడుతున్న కలలు...
ప్రశ్నలు వేస్తున్న అనుభవాలూ...
ఆ రోదనలు భరించక...
వేదనలు దాచుకోలేక...
అనుభవాల సుడి
నుంచి...
ఉబికి వస్తున్న ప్రశ్నలకు ...
సమాధానాలు చెప్పలేక...
భావావేశాలకు అలలుగా రూపమిస్తూ...
కెరటాలకు అంకితమిస్తూ...
ఒడ్డున విసిరేస్తున్న ...
సాగరుడిని చూస్తూ...
అలా నిలిచుండిపోయాను...
చిరుగాలి నుంచి పుట్టి...
హోరుగాలి చేయందుకుని...
ఒక ఉప్పెనగా దూసుకువస్తూ...
బండరాళ్ళను ముద్దాడుతూ...
అనుభవాలను విసిరేస్తున్న...
ఆ కెరటాలనుంచి...
రాలిపడుతున్న ఒక్కో కలలో...
నా కలలే చూసుకున్నా...
మానవ మాత్రం నా హృదయం...
కలలు రోదనలూ వేదనలను...
తట్టుకోలేని...
సాగరగర్భం కంటే...
నా హృదయం ...
చాలా చిన్నదేగా...
మనస్వినీ...
nice...
ReplyDelete