Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 18 January 2015

ఒంటరి నేస్తం...



ఒంటరి నేస్తం...


ఒంటరితనం
మనసుకు నేస్తమైతే...
మనసులో ఓంటరితనం
ఒక భాగమైపోతే...
మనసు మనసుతోనే
మాటలాడుకోదా...
మాటలకు మాటలే
తోడుకావా...
ఆ మాటల భావాల్లో
జ్ఞాపకాల పుష్పాలు
వికసించిరావా...
జ్ఞాపకాల దొంతరల్లో
జారిపడిన పుష్పాలు...
సుగంధ పరిమళాలై
మౌన ముద్రలో ఉన్న
మనసును తట్టిలేపవా...
నిశి దుప్పటి ముసుగేసిన
మనసులో కొత్త పుంతలు
చిందేయవా...
ఒంటరి పుష్పాలు
మనసుగుడిలో
ప్రేమ పుష్పికలను
నిత్యం చిగురించవా...
నిజమే ...
ఒంటరి మనసుకు
ఓంటరితనం
ఎంత మంచి నేస్తం....

No comments:

Post a Comment