సూర్యుడినే నేను...
ఆకాశ
వీధిలో
మిలమిల
మెరిసే తారకా...
నీ వెలుగు
జిలుగులు
మరెవ్వరికీ
లేవనీ
ఎందుకే
నీకు మిడిసిపాటు...
నువ్వేంటో
తెలుసుకో...
నీ వెలుగేంటో
నువ్వేంటో
నిజం నీకు
తెలియదా...
తళుకు
బెళుకులతో
వన్నె
చిన్నెలతో...
మెరిసే
నీవు
ఆకాశ వీధిలో
అరుదైన
అందానివే...
నీ అందమే
వినువీధికి అందం...
ప్రకృతికి
నీ మెరుపులే
అరుదైన
సోయగం...
నీవు
లేకపోతే
ఏమీ లేదు
ఇది నిజం...
ఓ తారకా
ఒక్క నిజం
మరువకు
స్వయం
ప్రకాశమే లేదు నీకు...
నీతో
నిత్యం దోబూచులాడే
నేలవంకకే
ఆ శక్తి లేదు...
నీ
మెరుపులు
నీ
వెలుగులు
ఆ చందమామ
సొగసులు
ఏవీ
లేవు...
సూర్యుడే
కన్ను మూస్తే
నీ మెరుపులెక్కడ...
ప్రభాత
భానుడి
వెలుగుల
చలవతో
మెరిసే
నీకు ఉనికి ఎక్కడ...
తారకా
సూర్యుడే
లేకపోతే
నీవే
లేవు...
నా
ఉనికిని తమ ఉషస్సు
అని
భ్రమల్లో తేలిపోయే
చాలా
మందికి
నేనే
వెలుగుని...
నేనే
నేర్పిన విద్యను
మరిచి
తామే సర్వం
అని
మిడిసిపడే
చాలా మంది
అమాయకులకు
నేను
సూర్యుడినే కాదా
మనస్వినీ...
No comments:
Post a Comment