నేలమీది జాబిలీ ...
ఎక్కడో దివిన
ఉన్న స్వర్గం భువిన
వెలిసిందా...
ఇంద్రలోకపు పారిజాతం
నేలపై మొగ్గ తొడిగిందా...
దేవలోకపు దేవకన్య
నేలపై పాదం మోపిందా...
ఊహల్లో నడియాడిన
ముద్దుగుమ్మ
కళ్ళముందు నిలిచిందా...
ఎవరు నీవు జవ్వనీ...
నాటి నా భావానివేనా...
కంటితెరలపై
నర్తించిన నా
ఊహల నర్తకివేనా...
నీ పాదాలకింద
నా మనసునే పరిచిన నేను
నా మనసే నీ మనసుకు
అంకితం చేశాను...
చూడు చందమామ
నాతో పోటి పడుతున్నాడు...
నేలకు జారి
నీ పాదాలను
ముద్దాడుతున్నాడు
మనస్వినీ...
No comments:
Post a Comment