ప్రకృతి కాంత ...
మంచు కురిసిన పచ్చికపై...
ముత్యాల్లా మెరిసే స్వాతి
చినుకులు...
నీ సుతి మెత్తని పాదాల కింద...
నలిగిపోతున్న పచ్చ గడ్డిలో...
చెదిరిపోతున్న స్వాతి
చినుకుల్లో...
రవ్వంత బాధ కూడా లేదెందుకో...
నీ పాద పద్మాలకింద ...
నలిగిపోతూ...
అవి కొత్త ఊపిరిని
పోసుకుంటూ...
మళ్ళీ మారాకు వేస్తున్నాయి...
నువ్వు ఆర్తిగా ముద్దాడిన ఆ
మొగ్గ...
పుష్పంలా వికసించాలని ...
ఎందుకలా ఆరాటపడుతోంది...
పూరెమ్మలతో...
చిరుమోగ్గలతో....
లేత మారాకులతో...
సవ్వడిలేకుండా...
సరసమాడుతున్న చిరుగాలి...
వసంతాన్నే విస్మరించి...
నీ చుట్టే తిరుగుతోంది
ఎందుకో...
వాడిపోయి రాలిపోయిన ...
ఆ పువ్వు...
నీ ముని వేళ్ళను తాకి...
మళ్ళీ వికసించి...
నీ సిగలో కొలువుదీరాలని...
ఆరాటపడుతోంది ఎందుకో...
ఒక్కటేమిటి...
ప్రకృతి సమస్తం ...
నీలో లీనమవ్వాలని...
తాపత్రయపడుతోంది ఎందుకో...
నువ్వు ప్రకృతికే అందం నేర్పిన...
అందానివే కదా...
మనస్వినీ...
Pic is beautiful along with kavita.
ReplyDeleteథాంక్స్ పద్మాజీ...
Delete