శూన్యం నుంచి శూన్యం లోకి...
వేకువ జామున...
కనులు తెరిచి చూసాను...
అంతా శూన్యమే...
మగతగా లేచి...
శూన్యమనే గదిలో నుంచి...
బయటకు తొంగి చూశాను...
కళ్ళు నులుపుకుని మళ్ళీ చూసాను...
ఆశ్చర్యం ...
సూరీడు రానేలేదు...
రానే రానని అలిగాడా ...
ఇక రానే రాడా...
పోనీ చంద్రమా ఎక్కడా...
నెలవంక కానరాదే...
మిణుగురు పురుగుల్లా...
మెరుపులు చిమ్మే...
తారకలెక్కడా...
ఏ నిశి తెరల చాటు...
తలదాచుకున్నాయి...
ఎందుకు వెలుతురు లేదు...
వెన్నెలమ్మ ఏమయ్యింది...
అప్పుడు తెలిసింది...
అది నా జీవితమని...
నేను శూన్యం నుంచే ...
శూన్యంలోకి తొంగి చూశానని...
మనస్వినీ...
బాగుంది కవిత
ReplyDeleteథాంక్స్ పద్మాజీ...
Delete