మళ్ళీ
వికసించమా...
సౌందర్యరూపమా...
నిశ్చల నిర్జీవ
మనో తటాకమా...
నీ లలిత లావణ్య
ముకుళిత హస్తాలలో
ఒదిగిన మేము..
ఎందుకనో సేదతీరలేకున్నాము...
నీ నులివెచ్చని కరములు...
మా లేత వన్నెలను
దహించి వేస్తున్నాయి...
ఏ భావమూ లేని
ముభావంలా ...
రాగమే తెలియని వీణలా...
సవ్వడి లేని
మువ్వల్లా...
వెన్నెలే కురిపించని
నెలవంకలా...
అలా మా వంక చూడకు...
సిగ్గుతో మరింతగా
ముడుచుకుపోతున్నాము...
పూజకోసం రాలేదు మేము...
మా సామి పాదాలపై పడి
కన్నీటి చుక్కలా కరిగిపోతాము...
ఒక్కసారి మనసుతో చూడు...
మేమెవరో తెలుస్తుంది నీకు...
గులాబిలా వికసించిన సామి
గుండెలో పూవుల రెక్కలమే మేము...
జాగెందుకు జవ్వనీ...
నిదురిస్తున్న సామి గుండెల పై
విసిరేయ్ మమ్ములను...
మళ్ళీ పుష్పాలమై
వికసిస్తాం చూడు...
No comments:
Post a Comment