నాకు నా శాపం ...
నా మనసంటే ...
నాకు అసహ్యం...
నా గమ్యం అంటే...
నాకు అయిష్టం...
నా దిశ దశ ...
నాకు వ్యతిరేకం...
అర్హతలేకున్నా ...
అందలం ఎక్కాలని ...
ఆరాట పడింది మనస్సు...
ప్రేమించానని...
భ్రమించింది మనస్సు...
నిజమేనేమో...
ప్రేమను పొందలేని...
మనసు ...
అలాంటి అర్హతే లేని మనస్సు...
మరొకరిని ఎలా ప్రేమిస్తుంది...
అందుకే నా మనస్సంటే...
నాకు అసహ్యం...
ఆది నుంచి...
అంతందాకా...
తప్పులే చేసింది నా మనస్సు...
అందుకే ...
నాకు నా మనస్సు ...
నచ్చలేదు...
నా మనస్సుకు ...
ఓదార్పే దక్కరాదు...
ఇదే నాకు నేను ...
పెట్టుకునే శాపం...
మనస్వినీ...
No comments:
Post a Comment