విలువలేని వాళ్ళు...
ఆకాశంలో ఉన్న నీవు...
నేలపై పడ్డావు...
పరుగులు తీస్తూనే ఉన్నావు...
నీ బాటలో మలుపులు ఎన్నో...
ప్రతి మలుపులో ...
కాలు జారి పడుతున్నావు...
ప్రతిసారీ...
నీ విలువ కోల్పోతున్నావు...
విలువను గాలికి వదిలి...
పరుగులు తీస్తూనే ఉన్నావు...
అదేంటో తెలియదు కానీ...
విలువలేని నీ కోసం ...
పరుగులు తీస్తూనే ఉన్నారు అందరూ...
కాలమనే చక్రానికి పోటీ ఇస్తూ...
విలవల వలువలు ...
గాలికి వదిలేసి ...
పరుగులు తీస్తూనే ఉన్నారు...
ఆకాశంనుంచి...
పాతాళానికి నీ పయనం...
విలువలే లేని నీ కోసం...
పరుగులు తీస్తున్న వారికి...
విలువలున్నాయంటే...
నమ్మగలమా...
విలువకోల్పోయిన ...
రూపాయినే నమ్ముకున్న వారికి ...
విలువలు ఉన్నాయంటే...
మనమైతే నమ్మము కదా...
మనస్వినీ...
No comments:
Post a Comment