గెలిచి ఓడిన జీవితం...
నచ్చిందే చేసాను...
మంచీ చెడూ...
నాలో నేనే ...
తర్కించుకున్నాను...
ఎవరి మాటా వినలేదు...
ఎన్ని చెప్పినా నమ్మలేదు...
మనసు మాటే విన్నాను...
నన్ను నేనే నమ్మాను...
చీకటితో నడిచాను...
వెన్నెలనే
వెతుక్కున్నాను...
నాకందరూ ఉన్నారనే...
అనుకున్నా...
అయినా నన్ను ...
నేనే నమ్ముకున్నా...
మనసు మార్గంలోనే ...
నడిచివెళ్ళా...
నా పయనం తీరం ...
చేరినా...
నా జీవన నావ ...
ఒడ్డునే మునిగిపోయింది...
అందరినీ ఓడించినా...
చివరకు...
నన్ను నేనే ఓడించుకున్నా...
విజేతను నేనే...
పరాజితుడినీ నేనే...
మనస్వినీ...
ReplyDeleteఓటమిని ఒప్పుకుని మరల ప్రయత్నించే వారు ఎప్పటికీ విజేతలే. Good one.
థాంక్స్ పద్మాజీ...విజేతను కావాలనే తాపత్రయం...
Delete