నా కంటిపాపలు...
నీతో గడిపిన ప్రతిక్షణం...
పంచుకున్న ఘడియలు...
మధురమైన అనుభూతులు...
తీపి చేదు బాసలు...
అన్నీ నెమరు వేసుకున్నా...
అనుభవాలు...
అనుభూతులను...
నేను కన్న కలలలో ...
ఆరబోసుకున్నా...
కంటిపాప కలలను...
అక్షరాలలుగా అల్లుకున్నా...
అక్షర తూణీరాలను...
నీ కంఠ మాలగా ...
మురుసుకున్నా...
నేను కన్న కలలు...
అల్లుకున్న భావాలు...
చెల్లా చెదురైపోతుంటే...
చేసేదిలేక ...
చూస్తూ నిలిచిఉన్నా...
అది నా తప్పా...
నా కలలను నేను...
చెరిపివేసుకుంటానా ...
ఆ కలలన్నీ ...
నాకు కంటి పాపలే...
మనస్వినీ...
No comments:
Post a Comment