భయమేస్తోంది...
ఎంతో ప్రియమైన నేస్తం నాకు
నిశిరాతిరి...
కొంటెగా పలకరించే
నా నెచ్చెలి చీకటమ్మ...
ఒళ్లంతా నిశి కాటుకను అద్దుకుని
నల్లని దుప్పటిలో
చెప్పుకున్న ఊసులూ
ఆడుకున్న ఆటలు
అన్నీ ఇష్టమే నాకు...
ఎందుకో ఏమో
చీకటంటే ఇప్పుడు భయం నాకు...
నల్లని మిన్నాగు చంద్రున్ని
మింగేసిన చందాన
వెలుగురేఖలను ఒక్కొక్కటిగా
నిశి దేవత మింగేస్తూ ఉంటే
వణుకుపుడుతోంది నాలో...
మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందా
అనే ఆత్రుత నాలో...
నిశిరాతిరి మత్తులో
కనురెప్పలు భారమయితే
ఆ కన్నుల పరదాలపై
నీ రూపమే కనిపిస్తోంది నాకు...
నీతో ముడివేసుకున్న
జ్ఞాపకాల పువ్వులు
తట్టిలేపుతున్నాయి నన్ను...
చీకటంటే
భయమేస్తోంది
మనస్వినీ...
No comments:
Post a Comment