దైవత్వం ...
పరమ పవిత్రం ప్రేమ...
నమాజును మించినది ...
పూజలను దాటేసింది...
అత్యంత పూజనీయం ...
నా ప్రేమ...
బీటలు వారిన ...
మసీదు గోడలు...
రాలిపడుతున్న మట్టిపెళ్లలు...
కుప్పకూలుతున్న గోపురాలు...
నోరు విప్పని రాతి బొమ్మలు...
మత సంకెళ్ళ బంధనాలు...
మనుషులనూ...
మనసులనూ ...
విడదీస్తున్న అంతరాలు...
పొగబారుతున్న భావాలు...
బూజుపట్టిన ఆచారాలు...
పనికిరాని విధానాలు...
అన్నింటిని జయించింది ...
నా ప్రేమ...
నమాజులోనూ ప్రేమే...
పూజలోనూ ప్రేమే...
అన్నింటా ప్రేమే...
మన సంగమం ...
ఒక కలయిక కాదు...
అది దైవత్వం ...
మనస్వినీ...
కవిత బాగుందండి.
ReplyDeleteథాంక్స్ పద్మాజీ...ఎదో రాతలు రాస్తున్నా...నా బ్లాగ్ చదువుతున్నారు.ధన్యవాదాలు...
Delete