నీ కంటి
కాటుకనే నేను...
కళ్ళలో ఉన్న ఆ భావం...
కన్నులకైనా తెలుసా...
ఒక్కసారి తొంగి చూస్తా...
అనుమతైనా ఇస్తావా...
నీ ఆనతే దొరికితే ...
ఆ కన్నుల్లో నేను...
గూడు కట్టుకోనా..
కనుపాపలో ...
చంటిపాపనై నిదురించనా...
కనుపాప భావంలో ...
సర్వం నేనేనై ఉండిపోనా...
కంటి వెన్నెల్లో నేనే...
చందమామనై విహరించనా...
కంటి ఆశలో ...
ఆశయాన్ని నేనే కానా...
కంటనీరే ఒలికితే...
కారిపోయే కాటుకను నేను కానా...
నీ కనురెప్పల పరదాలలో ...
నా రూపం పదిలం చేసుకుంటా...
చెదిరిపోని కాటుకనవుతా...
చిందించు నెచ్చెలీ...
కలకాలం ...
నీ కన్నుల వెలుగులు...
నీ కనుదోయి కమలాలే...
నాకు స్వర్గ సోపానాలు...
No comments:
Post a Comment