ఎగసిపడే సిరా చుక్క...
ఎగసి పడే సిరా చుక్కను నేను...
అది ఎరుపో నలుపో ...
నాకు అనవసరం...
మండుతున్న గుండెల్లో...
రగులుతున్న వేదనల్లో...
రంగులు అద్దుకుంది నా సిరా...
ప్రతి అక్షరాన్ని
అగ్ని కణం చేసి...
ప్రతి భావాన్ని ఉప్పెనలా మార్చి...
మేకతోలు కప్పుకున్న ...
ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని...
దహించివేయాలనీ...
కడిగిపారేయాలనీ...
ఉరకలు వేస్తోంది నా సిరా...
మౌనం ఎప్పుడూ ...
బలహీనత కాదనీ...
కుళ్ళు కుతంత్రాలకు...
ధీటుగా అది పొలికేక ...
అని చాటి చెప్పుతోంది ...
నా సిరా...
ఈ సమాజంపై ...
తిరుగుబాటుకు ...
నా సిరా అక్షరాల...
తూటాలను సిద్ధం చేస్తోంది ...
మనస్వినీ...
No comments:
Post a Comment