నడక నేర్పిన మనస్సు...
నడుస్తూనే ఉన్నాను...
ముళ్ళున్న రాళ్ళున్న
కరకు దారిలో...
నా అడుగులు ...
పడుతూనే ఉన్నాయి...
ఇసుక తిన్నెల్లో...
పాదాలు కూరుకు పోతున్నా ...
నా నడక సాగుతూనే ఉంది...
ఎండమావులు...
మాయ చేస్తున్నా...
ముందుకే నడిచాను...
సుడిగాలులు చుట్టేసినా...
వాయుప్రళయం...
వెనక్కి నెట్టినా...
నా అడుగుజాడల ...
ముద్ర చెదరలేదు..
అలల కెరటాలు...
నోరు తెరిచి ...
ఎగసి వచ్చినా...
గమ్యం మారలేదు...
రాళ్ళ దారిలో ...
పాదాలు కందలేదు...
ముళ్ళ కాటు తెలియనే లేదు...
ఎడారి బాటలో ...
గొంతు తడారనే లేదు...
అలల ధాటికి ...
భయమే లేదు...
భయమెందుకు నాకు...
నేను నడుస్తున్నది ...
నేలపై కాదు...
నా బాటలో ...
నీ మనసునే ...
పరిచేసావని...
నాకు అర్థమయ్యింది...
మనస్వినీ...
No comments:
Post a Comment