ఏ గీత గీసినా నీ రూపమే...
రవివర్మను కాను...
కాన్వాసుపై ...
బొమ్మలు వేయలేను...
అయినా మనసు ఆగలేదు...
తెల్ల కాగితంపై ...
నా కలంతో ...
ఒక గీత గీసాను...
అదేదో పిచ్చి గీత ...
అనుకున్నాను...
ఆశ్చర్యం...
అది పిచ్చి గీత కాదు...
చిత్రంగా అది నీ బొమ్మే...
కవిరాజుని కాదు...
అయినా రాయాలనుకున్నాను...
ఏదో రాసాను...
అది అక్షరం కాదు...
దివ్యమైన పదం...
అది నీ నామం...
నా అక్షరాల భావనలు...
పదాల విరుపులు ...
ఎన్ని మలుపులు తిరిగినా...
అవి నీ చుట్టూనే తిరిగాయి...
ఎందుకో తెలుసా...
నా కలం ...
నీ తీయని పెదాల...
మధురసాల్లో...
మునిగి తేలింది...
మరి...
నా కలం నుంచి జాలువారేది...
నీ రూపమే కదా...
మనస్వినీ...
బావుంది సర్ ...
ReplyDeleteధన్యవాదములు...
ReplyDelete