రాతి హృదయం...
ఆ జ్ఞాపకాలన్నీ ఇంకా
పదిలంగానే ఉన్నాయి నాలో...
నా కడుపులో ఆకలయితే
ముందుగా తన కడుపుకే తెలిసేది...
తినాలని నాకు లేకపోతే
గోరుముద్దలు పెట్టేది...
నా మనసులో బాధ ఉంటే
ఆ కంట నీరు ఒలికేది...
నేనున్నా నీకు అంటూ
ముందుగా ఆ మనసే స్పందించేది...
బయటికి వెళ్ళాలి నేనంటే
తనే ముస్తాబు చేసేది...
నాకు బాగా గుర్తు
తాను చేసిన సపర్యలన్నీ...
ఒక్కో జ్ఞాపకం ఒక్కో
కన్నీటి చుక్కలా
ఇప్పటికీ పలకరిస్తుంది నన్ను...
మనసున మనసై మెలిగిన ఆ మనసే...
నా పై విషం చిమ్మితే...
ఎర్రని పెదాలు నిప్పు కణికలే
రాలుస్తుంటే
చేయని తప్పులన్నీ
నాపైనే రుద్దితే...
తను సృష్టించుకున్న
మరో ప్రపంచం నన్నే వెక్కిరిస్తే...
అనుమానం
ఆవేశం
నాకు అవమానాలే మిగిల్చితే
ఓదార్చిన మనసే
మరణశాసనం లిఖిస్తే...
స్వాంతన ఇచ్చిన మనసే
అగ్గిమంటలు రేపితే
ఆ జ్ఞాపకాల కన్నీటి చుక్కలు
ఆవిరైపోవా...
మనసు బండబారిపోదా
మనస్వినీ...
No comments:
Post a Comment