శిశిరం చేసిన అల్లరి...
శిశిరం రేపుతున్న
అల్లరులు...
ప్రతి హృదిలో ఏవేవో
అలజడులు...
హిమవన్నగాలను
తలపిస్తున్న చల్లగాలులు...
వణుకుతున్న చలిలోనూ
తడారిపోతున్న పెదాలు...
నిశి దుప్పటి లో
ఉధృతమవుతున్న
ఆరాటం ...
ఏదో పోరాటంకోసం
మనసు చేస్తున్న చెలగాటం...
సూరీడు నిద్రలో జారుకుంటే...
విచ్చుకున్న కొంటె కోర్కెలు...
చలిమంటలు
స్వాంతన ఇవ్వని
ముడుచుకున్న రాత్రులు...
నరాలు గడ్డ కట్టిన
చలిలోనూ వెచ్చని రాత్రులు
మనవే కాదా...
తనువుల వేడిలో
చలిమంటలు కాచుకుంటూ ...
కరిగిపోయిన
నిశి ఆటలు
మనకు రసానుభవాలే కదా
మనస్వినీ...
థాంక్స్ కిషన్ గోపాల్ గారూ...
ReplyDelete