Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 26 January 2015

ప్రియమైన రాక్షసి...



ప్రియమైన రాక్షసి...


ఊర్వశివో ...
ప్రేయసివో...
ఊహవో ...
ఊహా సుందరివో...
ఎవరో నీవు గానీ...
నా గుండెలో ముల్లులా గుచ్చుకున్నావు...
అయినా నా గుండె నీకోసమే కొట్టుకుంటోంది...
పనికిరాని అనుమానాలతో
అర్ధమే లేని ఆవేశంతో
మనసును అల్లకల్లోలం చేసినా
మనోసాగరం అలలు
నీవైపే దూసుకుపోతున్నాయి...
నన్ను నన్నుగా ప్రేమించలేక
సూటిపోటి మాటలతో
నన్ను నువ్వు చంపేసినా
నా ఊపిరి ఇంకా
నీ నామస్మరణ చేస్తూనే ఉంది...
నీ ఆవేశం ఇష్టం లేదు నాకు...
నీ ఆలోచనలు అసహ్యం నాకు...
నేనే నిజం అంతా అబద్దమనే
నీ అంతరంగం నచ్చదు నాకు...
శ్వాస ఉన్నంత కాలం
నీ విధానం మారదని
తెలుసునాకు...
అయినా నువ్వంటే ఇష్టం నాకు...
నన్ను తిరస్కరించిన
నీ మనసు
మళ్ళీ స్వీకరించదని
తెలుసునాకు...
అయినా నా మనసు
ప్రేమిస్తూనే ఉంటుంది...
నువ్వు ఎప్పుడూ నాకు
ప్రియమైన రాక్షసివే
మనస్వినే...

No comments:

Post a Comment