Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 8 January 2015

ఇదే నా ఇజం...



ఇదే నా ఇజం...


అవును ....
నేను స్వార్ధపరుడినే...
నా మాటలు ఎవరికీ ...
అర్ధం కావు...
అలవోకగా అబద్దాలు ...
చెప్పేస్తుంటాను...
మనసులో ఉన్నది ...
పెదాలపైకి రానీయను...
నా నరనరాన స్వార్ధమే...
నా అనే నువ్వు నేను కాక ...
ఇంకెవ్వరు...
ప్రేమ కురిసినా...
ఆవేశం ఉబికినా...
నీకు నేనే అనుకున్నా...
అది స్వార్ధమే అయితే...
నేను స్వార్ధపరుడినే...
నీ పేరు నేను తప్ప ...
మరెవరు పలికినా...
సహించలేని నా తత్వం...
స్వార్ధమే అయితే...
అది స్వార్ధమే...
నా పలుకులు అగ్నిశిఖలు...
అవి అబద్దమే అనుకుంటే...
నేనూ అబద్దమే...
క్షణ సంతోషం కోసం...
నిజాన్ని అందమైన వస్త్రంలో...
దాచి పలకటం చేతకాని నేను...
అబద్దాల కోరునే...
నా అనే నిన్ను ...
నా పరోక్షంలోనూ...
ఎవరు కించపరిచినా...
నా గుండె మండితే...
అది అపరాధమే అయితే...
నేను అపరాధినే...
మర్యాద ఇవ్వని వారికన్నా...
అమర్యాద చేసే వారే...
ప్రమాదకరం ...
ఇది నిజం...
ఇది నిజమే అయితే...
నేను ఎలా నిజం కాదు...
ఇదే నా ఇజం...
మనస్వినీ...

No comments:

Post a Comment