Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 28 January 2015

నేను అహంకారినే...



నేను అహంకారినే...

అవును నేను అహంకారినే ...
ఎక్కడ లేని అహం నాలోనే ఉంది...
నేనెవరినీ పట్టించుకోలేదు...
పట్టించుకోను కూడా...
నేను నమ్మిన మార్గం
సత్యమే అని నమ్మినప్పుడు
నేను నాలాగే ఉంటాను...
ఎవరు అర్ధం చేసుకున్నా
అపార్ధం చేసుకున్నా
నేను నేనే ...
నా మార్గం నాదే...
గులాబీలు పలకరించినా
ముళ్ళ బాటలే ఎదురు వచ్చినా
పొంగిపోను
కుంగిపోను..
సమాజమంటే
సదాభిప్రాయం లేదు నాకు...
మిత్రులంటేనే గౌరవం నాకు...
నా అనుకునే వారే జీవితం నాకు...
మనసే మనసు నాకు...
ఆ మనసు ముందే
తల వంచుతాను నేను...
మనసే మనసును
మనసులా చూడనప్పుడు
పొగరు పొగబారిపోదా
మనస్వినీ...

No comments:

Post a Comment