అంతిమ విజయం నాదే...
నన్నేం చేసుకుంటారు...
ఏమీ చేయలేరు...
పుడమి గర్భంలో ...
పూడ్చి పెడతారా...
భగ భగ మంటల్లో ...
దహనం చేస్తారా...
నల్లపెట్టెలో బంధీని చేసి...
శిలువ సాక్షిగా ...
పాతిపెడతారా...
నేనో ఆకృతినే కానీ...
సజీవ దేహాన్ని కాదు...
కంటికి కనిపించే ఆకారాన్నే...
నడియాడే రూపానినే...
నన్నెలా తాకుతారు...
ఎలా మోస్తారు...
కంటికి కనిపించినా...
దేహాన్ని కానే కాదు...
నేనో మట్టి ధూళిని...
అనంత వాయువుల్లో...
పొగబారిన మేఘాన్ని...
ఖననం చేసినా ...
దహనం చేసినా...
నా జీవాన్ని ఏం చేయగలరు...
ముడుచుకున్న పువ్వులో...
రాలిపడుతున్న కన్నీటి చుక్కలో...
లెక్కలు కట్టి మరీ కొట్టుకునే...
హృదయస్పందనలో...
కంటి వెలుగును మబ్బు పట్టించే...
కనురెప్ప సుడులలో...
తడారిన గొంతుకల ...
ఆర్తనాదాలలో...
నేను నిత్యం కనిపిస్తూనే ఉంటాను...
నేనే నిత్యం ...
నేనే సత్యం ...
ఆదిని నేనే ...
అంతాన్నీ నేనే...
నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...
అంతిమ విజేతను నేనే...
మనస్వినీ...
good one.
ReplyDelete