తొలిస్పర్శ....
ఆ రసరమ్య ఘడియ...
పలకరించిన తొలి చూపు...
పులకరించి పిలచిన వేళ...
జతగూడాలనే ఆరాటం...
ఏకమవ్వాలనే పోరాటం...
నవ జవ్వని పెళ్లి కూతురై...
అందానికే అందంగా ముస్తాబై...
నా ముందు నిలిచిన నువ్వు...
భుజం మీద ఆర్తిగా పడిన
కరస్పర్శ...
అటువైపు తిరిగి సిగ్గు
దొంతరలతో...
ముసిముసి నవ్వుల
ముద్దుగుమ్మ...
ఒక్కసారిగా నీమేను
జలదరిస్తే...
విద్యుత్ తీగలు నరాల్లో
నాట్యమాడుతుంటే...
కడలి కెరటంలా నేను...
కరుగుతున్న మేఘమై నువ్వు...
పూరెమ్మలతో వికసించిన ...
రెండు లతలు అల్లుకున్నట్లు...
స్వేద బిందువులే పొగ
మేఘములై...
నిట్టూర్పుల వేడిలో
కరిగిపోతుంటే...
నేను నాలో లేకుండా...
నీలో నీవు లేకుండా...
ఒకరిలో మరొకరమై...
లీనమవుతుంటే...
శ్వాసను నింపుకోలేక ...
పిల్లగాలులే పారిపోతే...
కాలం స్థంభించకుండా...
ఎలా ఉంటుంది...
ఆకాశం పుడమిలో లీనమైనట్టుగా...
నీలో నేను కలిసిపోలేదా...
మైనం ముద్దలా నువ్వు
కరిగిపోలేదా...
నాటి ఘడియ నిత్యం కాదా...
ఆ తొలి స్పర్శ ఇప్పటికీ...
మనకు ప్రాణ వాయువు కాదా...
ఏ కవీ ప్రవచించని ...
మధుర కావ్యం కాదా...
మనస్వినీ...
No comments:
Post a Comment