నాది ఏ మతం...?
ఐదు పూటలా
నమాజులు...
నిత్యం
పరమపవిత్ర
ఖురాన్
పారాయణం...
పెదవి
కదిలితే అల్లా నామ స్మరణం...
నమాజు
వెనుక మతలబులు...
అయిన
వారిపైనే కుట్రలు...
జీవితాలతో
ఆటలు...
మనసులో
ఉన్నది మాటల్లో చూపని చేతలు...
ఆలోచనకు
అంతుచిక్కని
ఖల్
నాయికవు...
హైందవ ధర్మానికి
ప్రతీకవు నీవు...
గుండెనిండా
దుర్గామాతను నింపుకున్నావు...
ముక్కోటి
దేవతలకు ప్రణమిల్లుతుంది నీ మనసు...
మానవత్వమంటే
మా కులమే అంటావు...
శాంతి
సహనం ఆ మతం చూపిన మార్గం...
అది నీకు
అబ్బలేదు..
గీతలోని ఏ
ఒక్క అక్షరం నీకు వంటబట్టలేదు...
అనుమానమే
నీ మతం...
ఆవేశమే
నీకు వేదం...
ఖురాన్ కు
తలవంచాను నేను...
నమాజుకు
సలాం చేసాను నేను...
పరమతమయినా
హైందవానికి చేతులు జోడించాను...
నీ కులమే
గొప్పదని అంటే నిజమే అని తల ఊపాను...
మీ
ఇద్దరిలో ఎవరి మతం గొప్పది...
కుట్రలు
కుతంత్రాలతో
జీవితాన్ని
సర్వనాశనం చేసే వాళ్ళు
ఎన్ని నమాజులు
చేస్తే ఏం లాభం...
ఎన్ని
పూజలు చేస్తే ఏం ప్రయోజనం ...
కట్టుకున్నవాడిని బద్నాం చేయాలని ఖురాన్ లో రాసి ఉందా...
బతికుండగానే మొగుడిని చంపేయ్
అని గీతలో దేవుడు చెప్పాడా...
ఇదేనా భారతీయ స్త్రీ...
ఇదేనా మీ మతం...
ఇదేనా ఇస్లాం...
ఇదే నేర్పిందా హిందూ సమాజం...
ఇవే మీ ఇరువురి మతాలయితే
తిరస్కరిస్తున్నా మీ మతాల్ని...
ఇప్పుడు నాది ఏ మతం
మనస్వినీ...??
No comments:
Post a Comment