మజ్బూర్
మనస్సు...
మనసు తోటలో
మొగ్గతొడిగిన భావాలు...
అక్షర పుష్పికలై
వికసించి వస్తే
ఆ భావనల పువ్వులు
మరో గుండెకు ముళ్ళై గుచ్చుకుంటే
ఆ గుండెకు గాయమైనా
రక్తం కారేది నా గుండెలోనే కదా...
భావనల గులాబీల్లో
పూరెక్కలు గాలికి ఎగిరిపోయి
ముళ్ళే మిగిలిపోతే
పారిపోయిన పువ్వులను
మరిచిపోయి
నిందించేది
ముళ్ళనే కదా...
మిగిలిపోయిన
ముళ్ళు
చేసేది
గాయమే కదా...
అందుకే
భావనలకు
పరదాలు
వేసాను...
నా
అక్షరాలకు
కళ్ళెం
వేసాను...
మనస్సులోనుంచి
మనసునే
తుడిచేసాను...
మనసు
తోటలో
ఒంటరినయ్యాను...
ఇప్పుడు
నాలో భావమే లేదంటే
నా కవితలు
గాలికి
కొట్టుకుపోతుంటే
నేనేం
చెయ్యగలను...
మజ్బూర్
మనసుకు
సర్ది
చెప్పుకోవటం తప్ప
మనస్వినీ...
మనస్వినీ...
No comments:
Post a Comment