కరుగుతున్న కొవ్వొత్తి...
చిరుగాలిగా జనియించి...
హోరుగాలి చేయి అందుకున్నాను...
సూర్యుడిలో కిరణాలను...
కళ్ళలో నింపుకున్నాను....
జాబిలమ్మ వెన్నెలను ...
మనసులోకి దింపుకున్నాను...
రాలిపడే తారకల మెరుపులనే...
ఊపిరిగా మలుచుకున్నాను...
జీవితమనే బాటలో ...
ప్రతిక్షణం కాంతినై...
ముందుకే నడిచాను...
అందరికీ వెలుగులే పంచి ఇచ్చాను...
నిశి రాత్రుల వేళల్లో ...
వెన్నెలనై ముందుకు వచ్చాను...
కష్టాలు ఎదురైతే ...
కన్నీరు నేనయ్యాను...
సంతోషాలు వెల్లివిరిస్తే...
ముసిముసి నవ్వుని నేనే అయ్యాను...
నా వాళ్లకు అన్నీ నేనై...
నమ్ముకున్న వారి భుజానికి ...
ఆసరానయ్యాను...
అందరికీ అన్నీ ఇచ్చాను...
కరిగిన కాలంలో...
రాలిన కలనే నేనయ్యాను..
ఇప్పుడు అలసి సొలసిన నేను...
కరుగుతున్న కొవ్వొత్తినే కదా...
మనస్వినీ...
No comments:
Post a Comment