అది నీ రూపమే...
ఏదో రాయాలన్న తపన...
అది ఏమో తెలియని అయోమయం...
అయినా రాయాలని ...
ఆరాటం...
మనసు సుడిలో ...
తెలియని పోరాటమా...
నా అంతరంగానికే ...
ఆలోచనా తరంగమా...
అది భావమా...
నాలో ఉదయించిన...
అనురాగమా...
ఆవేదనా...
లేక ఆక్రందనా...
నాలో ఉబికిన ఆవేశమా...
గుండెను పిండిన ఆక్రోశమా...
ఏమో తెలియదు...
రాయాలనే అనుకున్నా...
రాస్తే తప్ప మనసుకు...
స్వాంతన లేదు...
రాయాలనే ప్రయత్నం...
మనసులో ఉన్న భావాలన్నీ...
అక్షరాలుగా మలుచుకుని...
నా కలం సిరాలో ...
ముంచుకున్నా...
ఆ కలం నుంచి కాగితం ...
పై ఒలికిన సిరా...
సరికొత్త రంగులు...
పులుముకుంటూ...
కలగాపులగంగా...
ఇంద్ర ధనుస్సు రంగులుగా...
గీసిన బొమ్మ ...
నీ రూపమే...
మనస్వినీ...
No comments:
Post a Comment