నన్ను తీసుకుపో...
మళ్ళీ వచ్చావు...
శూన్యమనే లోకం నుంచి...
కాలమనే వాహనంలో ...
నన్ను పలకరించేందుకు...
మళ్ళీ మళ్ళీ వస్తున్నావు...
నీ కోసం అందరూ ...
ఎదురుచూస్తుంటారు...
అందరి ఆశలు తీరుస్తూ ...
మురిపాలు పంచిఇస్తూ...
అందరికీ ఎనలేని ఆనందాలే ఇచ్చావు...
తెలుగు పంటల పండుగ వేళ...
అన్నదాత ఆనందించే
కాలం...
పల్లెపడుచు పరవశించే ఘడియ...
ఆనందాలు వెల్లివిరుస్తున్న పూట...
నువ్వుమాత్రం ప్రత్యేకంగా ...
ముస్తాబై నాకోసమే వస్తుంటావు...
ప్రతిఏటా వస్తావు...
ఇప్పుడూ వచ్చావు...
పలు ఘడియల్లో ...
నా ముందు ఉంటావు...
ఎందుకు వచ్చావు...
ఈసారి నాకు నీ రాక ...
ఆనందం ఇవ్వలేదు...
ఏముంది గర్వకారణం...
ఎందుకు నాకు ప్రమోదం...
ఒకరు కుట్రలు కుతంత్రాలతో...
సర్వనాశనం చేస్తే...
మరొకరు ప్రేమే నేను..
నేనే ప్రేమ అంటూనే...
అర్థంలేని ఆలోచనలతో...
గుండెకు గాయం చేస్తారు...
ఇంకొకరు తలవంచని ...
నా బిరుసుతనానికి...
బహుమానంగా ఉపాధినే ...
దోచుకుంటారు...
సమాజం నా మార్గంలో ...
పూలను ఏరిపారేసి...
ముళ్ళనే పరిచింది...
నావారు పరులై...
పరులముందు...
చులకనై...
కన్నీళ్ళే ఊపిరిగా...
వేదనలే ఆహారంగా...
కలతనిద్రలే...
పట్టెపానుపులుగా...
జీవిస్తున్నానో ...
మరణించానో ...
తెలియని నేను...
నీకెలా స్వాగతం పలకగలను...
వీలయితే నన్నూ తీసుకుపో నీతో...
ఈ జన్మదినం ...
నాకిష్టం లేదు...
మనస్వినీ...
No comments:
Post a Comment